కాంగ్రెస్లో.. బయటపడ్డ వర్గ విభేదాలు
కాంగ్రెస్లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. కొండమల్లేపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎన్నికలో రెండు వర్గాలకు చెందిన నాయకులు నేనంటే నేను అంటూ అధ్యక్షుడిగా ప్ర కటించుకోవడంతో పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి.
- గందరగోళంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడి ఎన్నిక
కొండమల్లేపల్లి, ఏప్రిల్ 10: కాంగ్రెస్లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. కొండమల్లేపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎన్నికలో రెండు వర్గాలకు చెందిన నాయకులు నేనంటే నేను అంటూ అధ్యక్షుడిగా ప్ర కటించుకోవడంతో పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. కొల్ముంతల్పహా డ్ సర్పంచ్ రమావత్ సరస్వతీరవినాయక్ 18 మంది స ర్పంచ్ల మద్దతుతో జనవరి 3న సర్పంచ్ల ఫోరం మండ ల అధ్యక్షురాలిగా ఎన్నికైన ట్లు రాత్రికి రాత్రి ప్రకటించుకొని ఎమ్మెల్యే బాలునాయక్ దగ్గరకు వెళ్లి సన్మానం అందుకున్నారు.
జనవరి 4న కేశ్యాతండా సర్పంచ్ రమావత్ రాజునాయక్ 19 మంది సర్పంచ్లు తనకు మద్దతు ఉందని, తానే సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షడిగా ప్రకటించుకున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులుగా ప్రకటించుకోవడంతో కాంగ్రెస్లో పెద్ద దుమారం రేగింది. ఈ విషయం ఎమ్మెల్యే బాలునాయక్ దృష్టికి వెళ్లడంతో నేను చెప్పే వరకు ఎవరినీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిని ప్రకటించొద్దని, ఆ ఎన్నికను రద్దు చేయాలని ఆదేశించారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉట్కూరీ వేమన్రెడ్డి జనవరి 6న ఇద్దరితో సమావేశం ఏర్పాటు చేసి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడి ఎన్నిక రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. గురువారం రమావత్ రాజు నాయక్ 21 మంది సర్పంచ్లతో సమావేశం ఏర్పాటు చేసి తానే సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. శుక్రవారం రమావత్ సరస్వతి తానే అసలైన సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలిగా ప్రకటించుకోవడంతో గందరగోళం ఏర్పడింది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

