తొలిరోజు 11 నామినేషన్లు
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రాగా, శుక్రవారం నోటిఫికేషన్ విడులైంది. ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి.
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్లు షురూ
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రాగా,
శుక్రవారం నోటిఫికేషన్ విడులైంది. ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగార్జునసాగర్ నుంచి ఒకరు, మునుగోడు నుంచి ముగ్గురు, మిర్యాలగూడ నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. నల్లగొండలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థితోపాటు స్వతంత్ర అభ్యర్థి.. నకిరేకల్‌లో బీఎల్ఎఫ్ అభ్యర్థితోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
నల్లగొండ, నవంబర్ 3: సాధారణ ఎన్నికలకుఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో సోమవారం తొలి రోజు జిల్లా వ్యాప్తంగా 12 నామినేషన్లు దాఖలు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజక వర్గాలు ఉండగా ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆర్వో కేంద్రాలు ఏర్పాటు చేసి సంబంధిత ఆర్వోలు నామినేషన్లు స్వీకరించారు. దేవరకొండలో తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాక పోగా నాగార్జున సాగర్ నుంచి ఒక స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ వేశారు.
మిర్యాలగూడ నుంచి స్వతంత్య్ర అభ్యర్థ్దులు ఇద్దరు నామినేషన్ వేయగా నల్లగొండ నుంచి ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పిల్లి రామరాజు యాదవ్, స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు నామినేషన్ వేశారు. మునుగోడులో ముగ్గురు స్వతంత్య్ర అభ్యర్థులు నామినేషన్లు వేయగా, నకిరేకల్ నుంచి ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులు, బీఎల్ఎఫ్ నుంచి నూనె వెంకటస్వామి నామినేషన్ వేశారు.
అయితే ఈ నెల 10 వరకు ఆరు నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో కేంద్రాల్లో ఈ నామినేషన్లు స్వీకరించనుండగా 13న స్క్రూటినీ చేపట్టి 15న ఉపసంహరణ చేపట్టి అదే రోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి బీ ఫామ్‌లు ఇచ్చిన వారికి అవే గుర్తులు కేటాయించనున్నారు. స్వతంత్య్ర అభ్యర్థ్దులకు మాత్రం ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఎంపిక చేసిన గుర్తులు కేటాయించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో మంచి రోజులు ఉండటంతో అదే రోజు ఎక్కువ మంది వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

