గరిడేపల్లి, జూన్ 19 : ప్రతీ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అనంతు గురవయ్య గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం గరిడేపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. పాపన్న ఆశయాలు, చరిత్ర గౌడ కులస్తులందరికీ తెలిసేలా భవిష్యత్ కార్యచరణ ఉండాలన్నారు. త్వరలో మండల, గ్రామ, జిల్లా కమిటీలను ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ అంజయ్యగౌడ్, కుక్కడపు వెంకటేశ్వర్లు గౌడ్, చిత్తలూరి సోమయ్య, నర్సింగ్ నాగ సైదులు, వీరప్రసాద్, జనలిగల శ్రీనివాస్, వెంకన్న, బాలకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.