పెద్దవూర, జూన్ 06 : పెద్దవూర మండలంలోని వెల్మగూడెం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షుడు భాషిపాక లక్షీసురేందర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రహీం, నామిరెడ్డి ప్రశాంతి, ఉప్పునూతల వెంకయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశాలు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.