శాలిగౌరారం, నవంబర్ 21 : ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని నల్లగొండ డీఎస్పి శివరామరెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం చేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది పనితీరును స్థానిక ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, ఎస్ఐ సైదులు ఉన్నారు.