దేవరకొండ, అక్టోబర్ 25 : దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం (1969-2025 బ్యాచ్) నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను కూడా ఇదే కళాశాలలో చదివానని గుర్తు చేస్తూ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ కళాశాలలో విద్యనభ్యసించిన ఎంతోమంది సమాజంలో చాలా ఉన్నత స్థాయిల్లో ఉన్నట్లు చెప్పారు. స్వర్గీయ మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి పేరుతో కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ మెంబర్ కాశీనాథ్, దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి, రాము చౌహాన్, లాలూ నాయక్, అంకురి రమేశ్, కొండయ్య పాల్గొన్నారు.

Devarakonda : దేవరకొండ జూనియర్ కళాశాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే బాలునాయక్