నీలగిరి, ఏప్రిల్19 : అక్రమంగా గంజాయిని రవాణా చేయడంతో పాటు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. శనివారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బిహార్‌కు చెందిన రాజేశ్‌కుమార్ ఏడాది క్రితం సూర్యాపేటకు వచ్చి స్థానిక రైస్‌మిల్లులో హమాలీగా చేరాడు.
గంజాయి తాగడం అలవాటున్న రాజేశ్ బిహార్‌కు వెళ్లి వచ్చే సందర్భంలో గంజాయి తెచ్చుకునేవాడు. గంజాయికి బానిసైన అతను పని మానేసి గంజాయిని విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. తనకు పరిచయం ఉన్న బిహార్‌కు చెందిన పప్పు యాదవ్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి నల్లగొండకు అక్రమంగా రవాణా చేస్తున్నాడు.
ఆరు నెలలుగా గంజాయిని తెచ్చి ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నాడు. రాజేశ్ గంజాయి తీసుకొని నల్లగొండకు వస్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అతడిని పట్టుకొని, అతడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో టూటౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదులు పాల్గొన్నారు.