‘ప్రభుత్వాలు తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలి’
ఎల్‌నినో కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...
– పంట రుణాలను రీ షెడ్యూల్ చేసి వడ్డీ మాఫీ చేయాలి
– వరి పంటకు రూ.30 వేలు, పత్తి ఎకరానికి రూ.50 వేలు నష్ట పరిహారం చెల్లించాలి
– సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్
చండూరు, నవంబర్ 10 : ఎల్‌నినో కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చండూరు తాసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో రైతులు వేసిన పంటలు ఎండిపోయాయని, గ్రామాలలో సాగునీరు, త్రాగునీరు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులపై ఉన్న పంట రుణాలను తక్షణమే రీ షెడ్యూల్ చేయాలని, రుణాలపై వడ్డీని పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంతో పాటు నష్టపోయిన రైతులకు ఎకరం రూ.50 వేల చొప్పున పత్తి పంటకు, రూ.30 వేల చొప్పున వరి పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
డిండి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలి
నల్లగొండ జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 200 రోజులకు పెంచాలని, కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరారు. సాగునీరు లేక ఎడారి ప్రాంతంగా ఉన్న మునుగోడు నియోజకవర్గానికి తాగునీరు అందించే డిండి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ సిపిఐ పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్, పార్టీ జిల్లా సమితి సభ్యులు తిప్పర్తి రాములు, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, మండల పార్టీ కార్యవర్గ సభ్యులు బరిగల వెంకటేష్, దోటి వెంకన్న, జెల్ల శ్రీను, బండమీది వెంకన్న, సి హెచ్ ఉషయ్య, గంటా రమేష్, ఇరిగి సంజీవ, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం నవీన్, కస్తాల సర్పంచ్ లేదన్న సత్యం, కురుపాటి పరమేష్, గంట నగేష్, పల్లె శంకరయ్య, శివర్ల లింగస్వామి, చీకటిమూడు యాదయ్య, జోగు రమేష్, జగన్, నరహరి, శ్రీశైలం పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

