నకిరేకల్, ఫిబ్రవరి 09 : గ్రామీణ పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో
డిగ్రీ చదువును విజయవంతంగా పూర్తి చేయాలని, డ్రాపౌట్ గా మారితే జీవితంలో పై చదువుకు వెళ్లే అవకాశాన్ని, ఉన్నతోద్యోగాలను కొల్పోతారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య అన్నారు. సోమవారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కార్యక్రమంలో భాగంగా ఐక్యూఏసి నిర్వహించిన ‘డ్రాపౌట్ తగ్గింపు’ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డిగ్రీ మధ్యలో ఆపేయడం (డ్రాపౌట్) వల్ల విద్యార్థులు అనేక విధాలుగా నష్టపోతారన్నారు. ఈ నష్టాలు కేవలం ఆర్థికపరమైనవే కాకుండా, కుటుంబ, సామాజిక, మానసిక అంశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. కళాశాలకు క్రమం తప్పక హాజరై విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి ఉన్నతోద్యోగాలకు అర్హతను పొందాలన్నారు. ఈ కార్యక్రమానికి ఐక్యూఏసి కోఆర్డినేటర్ డా.ఎం.శ్రీనివాసాచారి సంధానకర్తగా వ్యవహరించగా వైస్ ప్రిన్సిపాల్ నాగు, అధ్యాపకులు ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, డా.శంకర్, నర్సింహాచారి, శివశంకర్, రవీందర్, ఉపేందర్, కార్యాలయ సిబ్బంది వెంకన్న, కార్తీక్ పాల్గొన్నారు.

డ్రాపౌట్ వల్ల తీవ్ర నష్టం : డా.బెల్లి యాదయ్య