నీలగిరి, జూలై 20: వాతావరణంపై ఎల్ నినో ప్రభావం ఉన్నందున ఎటువంటి పరిస్థితులనైనా ఎదురొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కట్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొం డ జిల్లా పరిధిలో కరవు పరిస్థితులు, తాగునీటి లభ్యత, సాగునీరు, వ్యవసాయం, భూగర్భ జలాలు, విద్యు త్తు సరఫరా, మిషన్ భగీరథ మౌలి క వసతు కల్పనపై సోమవారం కలెక్టరేట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయం, ఉద్యానవనం, భూగర్భ జలాలు, విద్యుత్తు, మున్సిపల్, మిషన్ భగీరథ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ ని నో ప్రభావంతో మన దేశంలో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందన్నారు. జూలై 20 వరకు నమోదైన వర్షపాతం ఆందోళన కలిగిస్తోందన్నారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా తగినంత వర్షపాతం నమోదు కాకపోతే, వచ్చే ఏడాది జూలై వరకు ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నారు. అందువల్ల తాగునీటి వనరులను కాపాడటం అత్యంత కీలకమన్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కర్నాటక ప్రభుత్వాన్ని సంప్రదించి తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను విడుదల చేయమని అభ్యర్థించే అవకాశం ఉందన్నారు.
వచ్చే ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటిని అత్యం త పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీరు, భూగర్భ జలాల లభ్యతపై స్పష్టత లేని ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేయవద్దని సూచించారు. 578 గ్రామాలు, నాలుగు పట్టణాలకు తాగునీరు అందించే ఉద య సముద్రం రిజర్వాయర్‌లో సుమారు 1.5 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీరు డిసెంబర్ వరకు సరిపోతుందని, ఆ తర్వా త వచ్చే ఏడాది జూలై వరకు అదనపు నీటి అవసరం ఉంటుందని వివరించారు. పాలేరు జలాశయంలో ప్రస్తుతం 1.99 టీఎంసీల నీరు ఉండగా, అది దాదాపు 90 రోజుల వరకు సరిపోతుందని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజె క్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉం దని అధికారులు వివరించారు.
ఇన్చార్జి మం త్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నా రు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే ట్యాంకర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వలన తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పం టలు వేసేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
2028 ఆగస్టు నాటికి శ్రీశై లం సొరంగ మార్గాన్ని పూర్తి చేసి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ అఫీసర్ దాసరి హరిచందన, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మె ల్సీ ఎంసీ కోటిరెడ్డి, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, నేనావత్ బాలూనాయక్, పద్మావతి రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్, మేయర్ బుర్రి చైతన్య, మూడు జిల్లా ల కలెక్టర్లు చంద్రశేఖర్, తేజస్ నందలాల్ పవా ర్, అనురాగ్ జయంత్, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, శ్రీనివాస్, ప్రేమ్‌కరణ్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.