మునుగోడు, అక్టోబర్ 28 : మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను ఎంఈఓ తలమల్ల మల్లేశంతో కలిసి స్పెషల్ ఆఫీసర్, డీపీఓ వెంకటయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించి, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యుగంధర్ రెడ్డి, తాసీల్దార్ నరేశ్, సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ నర్మద, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.