పెన్పహాడ్, జనవరి 23 : పెన్పహాడ్ మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో గల మహబూబా దర్గా ఉర్సు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం గ్రామంలో ఊరేగింపు నిర్వహించి దర్గా వద్ద గంధం ఉంచి పూజలు నిర్వహించారు భక్తులు గంధం అందుకునేందుకు పెద్ద ఎత్తున ఎగపడ్డారు. ఈ ఉర్సుకి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు మునగాల, గరిడేపల్లి, సూర్యాపేట, మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వహకులు గోపగని సందీప్, హుస్సేన్, గురువయ్య, సైదులు, లక్ష్మీనారాయణ, పినెన్ని సందీప్ పాల్గొన్నారు.

Penpahad : వైభవంగా దూపహాడ్ మహబూబా దర్గా ఉర్సు ఉత్సవాలు