భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 25 : యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. యువ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్, బెట్టింగ్‌కి వ్యతిరేకంగా పట్టణంలోని పెద్ద చెరువు నుంచి శనివారం చేపట్టిన 5కే రన్‌ను జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం ప్రారంభించారు. ఈ రన్ పెద్ద చెరువు కట్ట సమీపం నుంచి ప్రధాన రహదారిలో కొనసాగి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేరింది. అనంతరం ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల్లోని డ్రగ్స్ సంస్కృతి మన దేశానికి పాకిందన్నారు.
యువత డ్రగ్స్, బెట్టింగ్ జోలికి పోకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు. సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని కోరారు. 5కే రన్లో నల్లగొండకు చెందిన పి.రమేశ్ మొదటి బహుమతి రూ.15వేలు, వరంగల్‌కు చెందిన సంగ్రామ్ రెండో బహుమతి రూ.10వేలు, లింగారెడ్డి మూడో బహుమతి రూ.5వేలు గెలుపొందారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సాంసృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మారెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జడ్పీటీసీ బీరు మల్లయ్య, కౌన్సిలర్లు పోత్నక్ ప్రమోద్‌కుమార్, రత్నపురం బలరాం, రోటరీ క్లబ్ చైర్మన్ యంపల్ల బుచ్చిరెడ్డి, యువ టీం కన్వీనర్ సూదగాని రాజు, సభ్యులు తంగెళ్లపల్లి మోహన్, రంగ రంజిత్, బండారు రఘు, కరిపె సురేశ్, పోత్నక్ సన్నీ, కుసుమ సాయితేజ, పట్నం ప్రణయ్, నర్ల స్నేహిత్, కాచం మహేశ్, దేశెట్టి సాయిచరణ్, మాదాసు రుత్విక్, పచ్చిమట్ల రాజు, మంచికంటి భానుచందర్, పొన్న వినోద్, చల్ల కిశోర్, రావుల సుధాకర్, శీలం విప్లవ్, లెంకళ్లపల్లి కిరణ్ పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 25 : ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన నియామకానికి మార్చి 3న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్ విభాగంలో బోధన సిబ్బంది అనగా ప్రొఫెసర్(1), అసోసియేట్ ప్రొఫెసర్(13), కాంట్రాక్టు (తాత్కాలికం) పద్ధతిపై సంవత్సరానికి పని చేయడానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు చేస్తారని తెలిపారు. ఉదయం 11గంటలకు బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో హాజరుకావాలని కోరారు. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను మార్చి 2వ తేదీ ఉదయం 10గంటల లోపు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు www.dme.telangana.gov.in, wwwgmcnalgonda.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.