నిడమనూరు, జులై 11 : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేయూత అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం కోరారు. మండలంలోని ముప్పారం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాజీ సర్పంచ్ ఆలంపల్లి మైసయ్య సొంత ఖర్చులతో శుక్రవారం విద్యార్థులకు అందించిన టై, బెల్ట్, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దాతల చేయూతను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా దాత మైసయ్యను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ విజయ్ కుమార్, కాంప్లెక్స్ హెచ్.ఎం.రాములు, రవి, లక్ష్మీనారాయణ, పరమేశ్ గౌడ్, శంకర్, గిరి, కోటేశ్, లక్ష్మయ్య, రాజేందర్, మధు, లింగయ్య, కాంతయ్య, దుర్గయ్య పాల్గొన్నారు.