తుంగతుర్తి, మార్చి 9 : ఆలయాల అభివృద్ధికి జనసేన నేత మేకల సతీశ్‌రెడ్డి ఆదివారం విరాళం అందజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో గల భవాని విశ్వేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షలు, అయ్యప్ప స్వామి ఆలయంలో సన్నిధి నిర్మాణానికి రూ.50 వేలు, ఎల్లమ్మ గుడికి రూ.50 వేలు విరాళంగా అందజేశారు. గ్రామాల్లోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న సతీశ్‌రెడ్డిని ఈ సందర్భంగా పలువురు శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.