కోదాడ, జూలై 12 : తుది శ్వాస వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సీపీఐ సీనియర్ నాయకుడు దొడ్డ నారాయణరావు చిరస్మరణీయుడని బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి అన్నారు. శనివారం చిలుకూరు మండల కేంద్రంలో నారాయణరావు మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమన్నారు. నివాళులర్పించిన వారిలో సామల శివారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కస్తూరి నర్సయ్య, కోలా ఉపేందర్, శ్రీకాంత్, లక్ష్మయ్య, మామిడి రామారావు ఉన్నారు.