తిరుమలగిరి, జూన్ 03 : రైతులు జీలుగా విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుమలగిరి మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సబ్సిడీపై రైతులకు జైలుగ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ 18 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్ తో తొండా రైతు వేదికలో ఏఈఓను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పాలపు చంద్రశేఖర్ పాల్గొన్నారు.