మోతె, జూన్ 5 : సీఎం సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మోతె మండలాధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని సర్వారం గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేకరబోయిన శ్రీనుకు రూ.25 వేలు, తాటికొండ లక్ష్మయ్యకు రూ.20 వేలు, రావుల ఎల్లమ్మకు రూ.20 వేల విలుల గల చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నోముల వెంకన్న, సీనియర్ నాయకుడు పురుషోత్తరావు, మాజీ ఎంపీటీసీ ఏలూరు వెంకటేశ్వరరావు, చుండూరు నరసింహా, గోదుల రమేశ్, పాపయ్య పాల్గొన్నారు.