బొడ్రాయిబజార్, డిసెంబర్ 11 : హైదరాబాద్లో జరిగిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పొలవరం, జడ్పీహెచ్ఎస్ తిరుమలగిరి, జడ్పీహెచ్ఎస్ గడ్డిపల్లి, టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జాజిరెడ్డిగూడెం, ఎంఎస్ఆర్ స్కూల్, బీ.ఆర్ వివేకవాణి సూర్యాపేట పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శించారు.
ఆదివారం జరిగిన ముగింపు సమావేశంలో టీఎస్ కాస్ట్ డైరెక్టర్ నగేశ్, కాస్ట్ స్టేట్ అకడమిక్ మార్టిన్ ఆఫీసర్, రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మదన్మోహన్ చేతుల మీదుగా ఆయా పాఠశాలల విద్యార్థులు, జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో డీఏసీ జి.శ్రీనివాస్,గైడ్ టీచర్లు జానయ్య, నజీర్, సంతోశ్శర్మ పాల్గొన్నారు.