దేవరకొండ, డిసెంబర్ 27 : దేవరకొండ పట్టణానికి చెందిన ముఫ జావిద్ హుస్సేన్ మృతి తీరని లోటని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జావిద్ హుస్సేన్ సంస్కరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 50 సంవత్సరాలుగా దేవరకొండ పట్టణానికి జావిద్ హుస్సేన్ సేవలందించారని కొనియాడారు. అందరికీ అభయంగా ఉంటూ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తనదైన శైలిలో సేవలందించారన్నారు. దేవరకొండ ప్రాంతం, ముఖ్యంగా ముస్లిం సమాజం పెద్ద దిక్కును కోల్పోయిందని తెలిపారు. ఆయన వెంట కేతావత్ బిల్యా నాయక్, వాజిద్ పాషా, ఇలియాస్ పటేల్, ఖాదర్ బాబా, అప్పోచ్, నజీర్, జాఫర్ ఉన్నారు.