నల్లగొండ, జూలై 19: వానకాలం సీజన్‌కు రూ.50కోట్ల పంట రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బెస్ట్ డీసీసీబీగా ఎన్నికకు సహకరించిన పాలకవర్గానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.3,500 కోట్లకు చేరేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆధికారులను ఆదేశించారు. సమావేశంలో వైస్‌చైర్మన్ దయాకర్‌రెడ్డి, డైరెక్టర్లు గొంగిడి మహేందర్‌రెడ్డి, సైదులు, సంపత్, జయరాం, సుష్మ, లింగం, ప్రవీణ్‌రెడ్డి, దొండపాటి రెడ్డి, రంగా చారి, ఆంజయ్య, శ్రీనివాస్, సైదయ్య, శ్రీనివాస్, అరుణ, రామచంద్రయ్య, గిరిధర్, శ్రవణ్, పత్యానాయక్, వినయ్, బ్యాంకు సీఈవో శంకర్ రావు, నిర్మల పాల్గొన్నారు.
త్రిపురారం, జూలై 19: మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న రైతు ధర్నాను విజయవంతం చేయాలని మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ డ్యాంలో 565 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రైతులకు నీరివ్వకుండా మోసం చేస్తోందన్నారు. నార్లు పోసుకొని నీరులేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చాలావరకు నారుమడులు ఎండిపోయాయన్నారు.