కనగల్, మే 21 : కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు గురువారం చేపట్టారు. 55 రోజులకు గాను రూ.9.72,755=00 ఆదాయం రావడం జరిగింది. ఆలయ మాజీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, నల్లగొండ జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బి.సుమతి, ఆలయ కార్యనిర్వణాధికారి అంబటి నాగిరెడ్డి, ధర్వేశిపురం గ్రామ సర్పంచ్ ఆర్.శేఖర్, గ్రామ కార్యదర్శి డి.పద్మ, భక్తుల సమక్షంలో ఆలయ హుండీల లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు ఎన్.మల్లాచారి, సిహెచ్ శ్రవణ్ కుమారాచార్యులు, అర్చకులు జి.ఉమామహేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ జే.చంద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ కె.ఉపేందర్ రెడ్డి, ఎన్. ఆంజనేయులు, కె.రాజయ్య, జే.నాగరాజు, సీహెచ్.శ్రీకర్, సాయి సేవా భక్త బృందం పాల్గొన్నారు.