యాదగిరిగుట్ట, మార్చి 13 : గత నాలుగు నెలలుగా పోసిన పాలకు డబ్బులు రావట్లేదంటూ పాడి రైతులు ఆందోళన బాటపట్టారు. గురువారం యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో పాలక్యాన్లతో నార్మూల్ పాల సేకరణ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. 30 మంది రైతులకు నెలకు లక్ష యాభై వేల రూపాయలు బిల్లు రావాలని రైతులు తెలిపారు.
నాలుగు నెలలుగా పాల బిల్లు ఇవ్వక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పశువులకు గ్రాసం కొనుగోలు చేయాలంటే ఇబ్బందిగా ఉందని వారు వాపోయారు. ఒకవైపు నీళ్లు లేక వరి పంట ఎండిపోయి మరోవైపు కరెంట్ సరిగ్గా సరఫరా కాక పూర్తిగా నష్టపోయిన తమకు పాలబిల్లు ఆసరాగా నిలుస్తుందని భావించినా అది కాస్త జాప్యం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.