నీలగిరి, అక్టోబర్ 04 : సి.టి.ఎస్ మెయిన్స్ 2025 పరీక్షలో ట్రేడ్వైజ్ టాప్ ర్యాంక్ సాధించిన ఆడెపు అశ్వినిని నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ 1 (ఓల్డ్) కళాశాలలో శనివారం ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నిర్వహించే CHARRE కౌశల్ దీక్షాంత్ సమారోహ్ (నైపుణ్య స్నాతకోత్సవ వేడుక) 2025లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అశ్విని అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐ.టి.ఐ. కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నర్సింహ్మా చారి మాట్లాడుతూ.. అశ్విని దేశ స్థాయిలో ర్యాంక్ సాధించడం చాలా గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ ఐ.టి.ఐ. కళాశాల ప్రిన్సిపాల్ సురేందర్రావు, అశ్విని తల్లి నర్సమ్మ, ఐ.టి.ఐ. శిక్షణా సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.