భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 18 : రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పర్యటనకు పకడ్బందీగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. సోమవారం ఆయన కలెక్టర్ హనుమంతుకే జెండగేతో కలిసి రాష్ట్రపతి సభా వేదిక ఏర్పాట్లు, పోలీస్ స్టేషన్ సమీపంలోని హెలిప్యాడ్, ట్రయల్ రన్‌ను పరిశీలించారు. అనంతరం వినోబా మందిరం, టూరిజం సెంటర్లో భూదాన స్తూపం, ఆచార్య వినోబాబావే, ప్రథమ భూదాత వెదిరే రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలు, భూదానోద్యమం సంబంధించిన చిత్రాలు, రంజన్ సిల్ యూనిట్లలో ఇకత్ పట్టు చీరల తయారీ ప్రక్రియ, చేనేత యూనిట్లు, స్టాళ్లు ఏర్పాటుకు వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . పర్యటన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్రపతి సభా వేదిక వద్దకు అనుమతి ఉన్న వారినే అనుమతించాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడీషనల్ కలెక్టర్ భాసరరావు, వీవర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్‌కుమార్, రాష్ట్ర చేనేత జౌళి శాఖ అడీషనల్ డైరెక్టర్ ఎం.వెంకటేశం, రాచకొండ అడీషనల్ సీపీ తరుణ్ జోషి, చౌటుప్పల్ ఏసీపీ మొగులయ్య, జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ విద్యాసాగర్, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునంద, డీసీహెచ్ఓ అన్నపూర్ణ, ఆర్డీఓ జగన్నాథరావు, తాసీల్దార్ వీరా భాయ్, మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, ఎంఆర్ఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ ఎస్సై విక్రంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం హెలీకాప్టర్ ట్రయల్ రన్ చేసింది. రాష్ట్రపతి రాక సందర్భంగా బాలాజీ ఫంక్షన్ హాల్ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.