నల్లగొండ సిటీ, డిసెంబర్ 23 : కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు మంగళవారం చేపట్టారు. వంద రోజులకు గాను రూ.13,71,173 ఆదాయం రావడం జరిగింది. నల్లగొండ జిల్లా సహాయ కమిషనర్ దేవదాయ శాఖ కె.భాస్కర్, ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్రెడ్డి, ఆలయ కార్యనిర్వణాధికారి అంబటి నాగిరెడ్డి, ధర్వేశిపురం గ్రామ సర్పంచ్ ఆర్.శేఖర్ సమక్షంలో ఆలయ హుండీల లెక్కింపు చేపట్టారు. ఈ ఇట్టి కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఎన్.రాజు, కె.నరేశ్, కె.శంకర్ రెడ్డి, ఎన్.అంజయ్య, ఆర్.వెంకన్న, ఎన్.బాబు, కె.ప్రభాకర్, ఆర్ఐ యాదగిరి, ఆలయ ముఖ్య అర్చకులు సీహెచ్ శ్రవణ్ కుమారాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ జే.చంద్రయ్య, జి.నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ కె.ఉపేందర్ రెడ్డి, ఎన్.ఆంజనేయులు, కె.రాజయ్య, జే.నాగరాజు, సీహెచ్.శ్రీకర్, సాయి సేవా భక్త బృందం పాల్గొన్నారు.