రామగిరి, జనవరి 4 : నేటి ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా సైన్స్‌కు పోటీ పెరుగుతున్నదని, సైన్స్ ఆధారంగానే జీవన విధానం మారుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్లగొండలోని డాన్‌బాస్కో హైస్కూల్ నిర్వహించిన జిల్లా సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన ముగింపు కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. మండలి చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గతంలో వ్యవసాయం కష్టంగా ఉండేదని, శాస్త్రవేత్తలువి విధ రకాల యంత్ర పరికరాలు, పనిముట్లను కనుక్కోడం వల్లే సులభతరం అయ్యిందని తెలిపారు.
నేటి చదువుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సబ్జెక్టుగా మారిందని గుర్తుచేశారు. విద్యార్థులోని సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు దోహద పడుతాయన్నారు. ప్రదర్శనలో ప్రథమ, ద్వితీ య, ప్రోత్సహక కేటగిరీల్లో ఎంపికైన ప్రాజెక్టుల విద్యార్థులు, గైడ్ టీచర్స్, బీఈడీ ఛాత్రోపాధ్యాయులు, టీచర్స్ ఎగ్జిబిట్స్‌లో ప్రథమ స్ధానం సాధించిన వారికి బహుమతులు, ప్రశంసాప్రతాలు అందజేశారు. డీఈవో భిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ సీఈఎ నంద్యాల ప్రేమ్‌కరణ్‌రెడ్డి , జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, డాన్‌బాస్కో స్కూల్ ప్రిన్సిపాల్ బాలశౌరిరెడ్డి, ఎంఈఓ అరుంధతి, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి రామచంద్రయ్య, ఎఫ్ఏఓ యుగేంధర్నాథ్, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో జరిగే ప్రదర్శనలో పాల్గొనున్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రతీక్ ఫౌండేషన్, మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో నగదు బహుమతి అందిస్తామని ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవీ గోనారెడ్డి ప్రకటించారు.