నల్లగొండ ప్రతినిధి, జూన్4 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు కూటమి నేతలంతా అమరావతి బ్రహ్మాండం…ఈ ప్రపంచంలోనే అంత మంచి రాజధాని లేదు అని చెప్తున్నారు. అంత బ్రహ్మాండంగా ఉంటే వీరంతా కుటుంబ సభ్యులతో అక్కడ ఎం దుకు నివాసం ఉండటం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. అమరావతి ఫేమస్ కావాలన్నా…సీఎం, మం త్రులు, అధికారులంతా వారి కుటుంబ సభ్యులతో అమరావతిలోనే నివసించాలని హితవు పలికారు.
హైదరాబాద్‌లో నివసిస్తూ అమరావతిలో పాలన చేస్తూ సెటిల్ సర్వీస్ ప్రయాణాలు బంద్ చేసుకోవాలన్నారు. గురువారం ఆయన నల్లగొండలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. అమరావతిపై ఆలోచనలు చేస్తూ తెలంగాణ వైపు చూపు తగ్గించుకోవాలని సూచించారు. పవన్ కల్యా ణ్ తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో సభ పెట్టాలనుకోవడం అవివేకమన్నారు. తెలంగాణ ఇక్కడి ప్రజల సెంటిమెంట్ అని తెలిశాక కూడా ఇలా చేయడం సరికాదన్నారు. తెలంగాణ మీ అయ్య జాగా రా అంటూ మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమన్నారు.
తెలంగాణ ఇక్కడి ప్రజలది, ఇక్కడే పుట్టిపెరిగిన వాళ్లదే ఇందులో ఎలాం టి సందేహం లేదన్నారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. దశాబ్దాలుగా ఎన్నో అరాచకాలు, అవమానాలు భరి స్తూ చివరకు ఇక భరించలేక కేసీఆర్‌తో పాటు ప్రజాసంఘాలు, కాంగ్రెస్ కృషితో రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. నాడు ఆంధ్ర ప్రాం త ఎంపీలు తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు కృషి చేసిన విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదన్నారు. తెలంగాణకు 50 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఏపీపైనే ఉందన్నా రు. సామరస్యంగా జీవిస్తున్న ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే ప్రయత్నాలను కూటమి నేతలు మానుకోవాలని హితవు పలికారు.