నీలగిరి, జూన్ 11: ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు, ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి రూ.7.71 లక్షల నగదు, మూడు బైక్‌లు, రెండు కట్టర్లు, నాలుగు పానాలు, హ్యాండ్ గ్లౌజెస్ స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత డిసెంబర్లో కల్యాణి స్టీల్ లిమిటెడ్ కంపెనీలో 21 వేల లీటర్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, కాపర్ కాయిల్స్, 220 కేవీ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఓఎల్టీసీ ఆన్లోడ్ టాప్ చేంజర్‌కు చెందిన 3 హెచ్వీ, 3ఎల్వీ కాపర్ ఎలిమెంట్స్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందిందన్నారు. వీటితోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా కాపర్ వైర్ చోరీ జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసినట్లు తెలిపారు.
ఈ క్రమంలో బుధవారం మధ్యా హ్నం సమయంలో నారట్ పల్లి శివారులోని రెడ్డయ్య ఫ్యాక్టరీ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా మూడు బైక్‌లపై వస్తున్న ఐదుగురు వ్యక్తులను ఆపి పోలీసులు తనిఖీ చేసినట్లు తెలిపారు. బైక్‌లకు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో పా టు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు బర్మా నుంచి వలస వచ్చి హైదరాబాద్‌లోని బాలాపూర్ సమీపంలోని హఫీజ్‌బాబా నగర్లో నివసిస్తున్నట్లు తేలింది. వీరిని హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, నూర్ కాసిమ్, నూరుల్ అమీన్, నూరుల్ ఆలం @ మహబూబ్ ఆలంగా గుర్తించినట్లు తెలిపారు.
వీరు సుమారు 12 సంవత్సరాల క్రితం బర్మా నుంచి శరణార్థులుగా భారతదేశానికి వచ్చి, కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి, అనంతరం హైదరాబాద్‌లోని బాలాపూర్ రాయల్ కాలనీలో నివసిస్తూ కూలి పనులు చేస్తున్నారన్నారు. వారంతా కలిసి మద్యం సేవించే క్రమంలో ముఠాగా ఏర్పడినట్లు తెలిపారు. కూలి పనులు చేయగా వచ్చిన డబ్బులు వారి కుటుంబ అవసరాలు, జల్సాలకు సరిపోకపోవడంతో తకువ సమయంలో ఎకువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని ట్రాన్స్ఫార్మర్లలో ఉండే కాపర్ మెటీరియల్, ఆయిల్, అల్యూమిని యం వైర్లను చోరీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరంతా ముఠాగా ఏర్పడి బైక్‌లపై మూసివేసిన కంపెనీలు, గ్రామాలకు దూరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, రాత్రి సమయంలో గుర్తు తెలియని ఆటోలను అద్దెకు మాట్లాడుకొని వెళ్లి, పానాలు, కట్టర్ల సహాయంతో ట్రాన్స్ఫార్మర్లను కట్ చేసి వాటిలోని ఆయిల్, కాపర్ వైర్, తదితర వస్తువులను చోరీ చేసేవారన్నారు. అలా వచ్చిన డబ్బును అందరు సమానంగా పంచుకొని కుటుంబ అవసరాలకు, జల్సాలకు వినియోగించేవారన్నారు.
ఇలా వీరిపై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఒకటి, మాడ్గులపల్లిలో రెండు, చిట్యాలలో ఒకటి, వేములపల్లిలో రెండు, వాడపల్లిలో రెండు, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో ఒకటి, యాదగిరిగుట్టలో ఒకటి, రామన్నపేటలో ఒకటి, భువనగిరి రూరల్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసును డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఛేదించారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్‌రెడ్డి, నారట్పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ సతీశ్ వర్మ, నారట్పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి, హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, వహీద్ పాషా, కానిస్టేబుళ్లు అస్రార్, శివరాజ్, నరేశ్, జునైద్, కమల్ కిశో ర్ను జిల్లా ఎస్పీ పవవార్ అభినందించినట్లు తెలిపారు. సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్‌రెడ్డి, నార్కట్‌పల్లి ఎస్ఐ విష్ణు తదితరులు పాల్గొన్నారు.