చండూరు, ఏప్రిల్ 22 : పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని సిపిఐ నలగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు, చండూరు ఏఎంసి డైరెక్టర్ నలపరాజు రామలింగయ్య అన్నారు. మంగళవారం చండూరులోని సిపిఐ కార్యాలయం మాదగోని నరసింహ భవనంలో జరిగిన మండల కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహించాలని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ శాఖ మహాసభలు జరుపుకోవాలని, అన్ని గ్రామాలలో సిపిఐ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు.
మే 12న మండల మహాసభ నిర్వహించుకోవాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మండల పార్టీ సహాయ కార్యదర్శి పల్లె యాదయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి నలపరాజు సతీశ్‌కుమార్, సహాయ కార్యదర్శి బొడ్డు వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు తిప్పర్తి రాములు, బరిగల వెంకటేశ్, దోటి వెంకన్న, బండమీది వెంకటేశం, జెల్లా శ్రీను, సిహెచ్ ఉషయ్య, నాయకులు పల్లె శంకరయ్య, శివర్ల లింగస్వామి, పల్లె నరసింహ, పరమేశ్, దోటి యాదయ్య, కాశిమల్ల శ్రీను, దశరథ, గడ్డం నవీన్, యాదయ్య, కట్ట వెంకన్న, ఎండి కరీం పాల్గొన్నారు.