కట్టంగూర్, సెప్టెంబర్ 05 : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. శుక్రవారం కట్టంగూర్ లోని అమరవీరుల స్మారక భవనంలో జరిగిన భవన నిర్మాణ సంఘం మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిరేకల్ ఏఎల్ కార్యాలయంలో కట్టంగూర్ మండలానికి సంబంధించిన భవన కార్మికులకు రావాల్సిన ప్రయోజనాల ధరఖాస్తులు నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదన్నారు.
సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 10న నకిరేకల్ ఏఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కత్తుల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి గద్దపాటి ఇస్తారి, ఉపాధ్యక్షుడు బొల్లెద్దు నర్సింహ్మ, సహాయ కార్యదర్శి ఊట్కూరి మల్లేశ్, సభ్యులు ఏరు చంద్రయ్య, పెంజర్ల రవి, చింత ముత్యాలు, గద్దపాటి సురేశ్, గద్దపాటి శ్రీను పాల్గొన్నారు.