నకిరేకల్, అక్టోబర్ 8: కాంగ్రెస్ 22 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రభుత్వంపై పల్లెల్లోని జనం దుమ్మెత్తి పోస్తున్నారని, ఆ పార్టీ నాయకులను ప్రజలు చీపుర్లతో ఉరికించే కొట్టే రోజులు ముందున్నాయని, ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నకిరేకల్‌లో ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి 22 నెలల పాలనలో ప్రజలకు ఇవ్వాల్సిన కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాం గ్రెస్ మోసం చేసిందన్నారు. మర్చిపోయిన హామీలను గుర్తు చేయాలనే ఉద్దేశం తో ప్రజల వద్దకు బాకీ కార్డులు తీసుకొచ్చామన్నారు. అమలుకాని హామీలతో, మోసపూరిత మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిందన్నారు.
వృద్ధులకు రూ.4 వేల పిం ఛను, దివ్యాంగులకు రూ.6 వేలు పిం ఛను ఇస్తామని మోసం చేసిందన్నారు. మహిళలు, విద్యార్థినులు, నిరుద్యోగులు, ఆటో కార్మికులు, రైతు కూలీలను మోసం చేసిన దుర్మార్గ పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గుణపాఠం చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నా రు. కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్, పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, పల్లె విజ య్, నవీన్‌రావు, గుర్రం గణేశ్, రాచకొండ వెంకన్న, సోమ యాదగిరి, రావిరాల మల్లయ్య, సామ శ్రీనివాస్‌రెడ్డి, దైద పరమేశ్, లింగారెడ్డి, రాచకొండ శ్రవణ్, పేర్ల కృష్ణకాంత్, అశోక్ పాల్గొన్నారు.
బాకీ కార్డులు పంపిణీ చేయాలి
హాలియా, ఆక్టోబర్ 8 : కాంగ్రెస్ అంటేనే మోసం, దగా అని మాజీ ఎమ్మెల్యే, నోముల భగత్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన హాలియాలోని తన క్యాం పు కార్యాలయంలో గుర్రంపోడు మం డల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలసి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డుల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందన్నారు.
తాము అధికారంలోనికి వస్తే 100 రోజు ల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తయినా ఆరు గ్యారెంటీలు కానీ, 420 హామీలను కానీ అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో నాగులవంచ తిరుపతిరావు, వజ్జ ధనుంజయ్, చామల బుజ్జ య్య, మేకల వెంకట్‌రెడ్డి, దైద శ్రీనివాసరెడ్డి, ఎర్రమాద ఉపేందర్‌రెడ్డి, కామల్ల రాములు, వెలుగు శంకర్, పానుగుండ్ల వెంకన్న పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు పరాజయం తప్పదు
గరిడేపల్లి, అక్టోబర్ 8: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాజయం తప్పదని హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి వ్యా ఖ్యానించారు. గరిడేపల్లిలో బుధవారం ఆయన కాంగ్రెస్ బాకీ కార్డులను విడుద ల చేసిన అనంతరం మాట్లాడారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఇప్పటి వర కు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కార్యక్రమంలో కృష్ణనాయక్, వెంకట్‌రెడ్డి, ప్రమీలా వెంకటరమణారెడ్డి, రాంసైదులు, శ్రీహరి, జ్యోతీ రామారావు, సుధీర్, నాగిరెడ్డి, భాస్కర్, వీరయ్య, వెంకటరాములు, నరేశ్, వీరాస్వామి, స్వప్న, ఇసాక్, శోభన్‌బాబు, వెంకటేశ్వర్లు, సైదులు, ధనయ్య, సుందరయ్య, గోపాల్, లింగయ్య ఉన్నారు.
ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
పెద్దఅడిశర్లపల్లి అక్టోబర్ 8 : ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పీఏపల్లిలో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 నెలల పాలనలో వేల కోట్ల అప్పులు తెచ్చినా, ఆరు గ్యారెంటీలను మాత్రం అమలు చేయలేదన్నారు. విద్యార్థులకు భద్రత కార్డులు, ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రతి గ్రామంలో బాకీ కార్డులను పంపిణీ చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో వల్లపురెడ్డి అంజిరెడ్డి, మహేందర్, ఆర్వపల్లి నర్సింహ, సుధాకర్, శ్రీను, యాదగిరి ఉన్నారు. అనంతరం గుడిపల్లి, పీఏపల్లి మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ చేరారు.