గౌరవ సభ కాదు కౌరవ సభ : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
– ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం
– మహిళా ఎమ్మెల్యేలపై భౌతిక దాడులు అమానుషం
– అరెస్టులు చేయడం సర్వ భ్రష్టత్వానికి నిదర్శనం
– దాడి చేసిన పోలీసులను విధుల నుండి తొలగించాలి
– ప్రభుత్వ పెద్దలు క్షమాపణలు చెప్పాలి
– కోదాడలో గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా
కోదాడ, సెప్టెంబర్ 07 : అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం కోదాడ ప్రధాన రహదారిపై గల గాంధీ విగ్రహం ఎదుట ఆయన పార్టీ శ్రేణులతో కలిసి నిరసన, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో పోలీసు రాజ్యం కొనసాగుతుందని, ప్రజాస్వామ్యం అడుగంటి పోయిందన్నారు. మహిళా ఎమ్మెల్యేలనే గౌరవం లేకుండా సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై అమానవీయంగా దాడి చేయడం దుర్మార్గమన్నారు.
ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే ఈ దుశ్చర్య జరిగిందన్నారు. ఇది గౌరవ సభ కాదని కౌరవ సభ అని విమర్శించారు. భౌతిక దాడులకు పాల్పడిన పోలీసులను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, జరుగుతున్న దుష్పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తాలేక ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధులపై దాష్టీకాన్ని ప్రదర్శించడం శోచనీయమన్నారు. అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ దుర్ఘటనకు ముఖ్యమంత్రి, మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పార్టీ నాయకులు ఎస్కే నయీమ్, చీమ నరేష్, ఉపేందర్ గౌడ్, చలిగంటి వెంకట్, మల్లయ్య గౌడ్, అబూ, కరిముల్లా, బాబా, బత్తుల ఉపేందర్, భాగ్యమ్మ, మజార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

గౌరవ సభ కాదు కౌరవ సభ : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

