– శాలిగౌరారంలో బాకీ కార్డుల పంపిణీ
శాలిగౌరారం, అక్టోబర్ 09 : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారం శాలిగౌరారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల, స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిశోర్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఇప్పటివరకు ఒక్కో వ్యక్తికి ఎంత బాకీ పడ్డదో తెలియజేస్తూ ఆ పార్టీ నాయకులు ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రశ్నించాలని, బాకీ కార్డులు చూపించి ఎండగట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారందరినీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, చాడ హతీష్ రెడ్డి, కట్ట వెంకట్‌రెడ్డి, గుండా శ్రీనివాస్, మామిడి సర్వయ్య, గుజిలాల్ శేఖర్ బాబు, జెర్రిపోతుల చంద్రమౌళి గౌడ్, దుబ్బ వెంకన్న, భూపతి ఉపేందర్ గౌడ్, మామిడి రమేశ్, అంబాల కృష్ణమూర్తి గౌడ్, దాసరి వెంకన్న, బైరు నాగరాజు గౌడ్, తీగల వెంకన్న, కమలాకర్, బొడ్డు విజయ్, అంకర్ల పున్నమినాగులు పాల్గొన్నారు.