హామీల అమలులో ప్రభుత్వం విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీల అమలులో విఫలమైందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం గుర్రంపోడ్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలుకాని హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి, మంత్రులు హామీలను విస్మరించారన్నారు.
- ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
గుర్రంపోడ్, జూలై 2 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీల అమలులో విఫలమైందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం గుర్రంపోడ్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలుకాని హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి, మంత్రులు హామీలను విస్మరించారన్నారు. 2014 కంటే మందు తెలంగాణ వ్యవసాయ రంగం దయనీయంగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగం కష్టాలను చూసి రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతో పాటు, ఎరువులు, సాగు నీటికి లోటు లేకుండా చేశారన్నారు.
ధాన్యం విషయంలో తెలంగాణను మొదటి స్థానంలో ఉంచారన్నారు. రైతు బంధు ద్వారా ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం, రైతు బీమా అందించిన ఘనత దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. పండించిన పంటను ఎలాంటి కట్ంగ్లు లేకుండా గిట్టుబాట ధరకు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా బలోపేతం చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పండించిన పంటకు క్వింటాకు 8 కిలోల చొప్పున సెంటర్ నిర్వాహకులు, మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దగా చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి కార్పొరేటు స్థాయిలో విద్యనందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మెయింటెనెన్స్ కూడా చేయడం లేదన్నారు.
అలాగే ముందు చూపు లేకుండా కృష్ణా జలాలను ఆంధ్రోళ్లు తీసుకెళ్తుంటే సోయి లేకుండా మంత్రులు ఉన్నారన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ తీర్చి దిద్దారన్నారు. వృద్ధ్దాప్య పెంఛన్లను రూ.200 నుంచి రూ.2 వేలు చేసిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డలకు రూ.1,00,116 ఇచ్చారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దిం చి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకడు పాశం గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సామల బొజ్జ య్య, నాయకలు ఎల్ఎన్ రెడ్డి, వడిత్యా నాగరాజు నాయక్, మునికుంట్ల బాల్ రెడ్డి, కూనూరు సైదిరెడ్డి, జాల మల్లే శం, మల్లోజు శ్రీనివాసాచారి, పోలె రామచంద్రం, కుంభం ప్రశాంత్ రెడ్డి, తెలుకుంట్ల కుర్మల్ రెడ్డి, మునికుంట్ల రాజేశ్రెడ్డి, యాదయ్య, సిరాజ్, నగే శ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

