నల్లగొండ పట్టణం రామగిరిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 1952లో ప్రారంభమైన ఈ పాఠశాల.. నాటి నుంచి నేటి వరకు అద్దె భవనంలోనే కొనసాగుతున్నది. కాలక్రమేణా ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్నది. తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. పైకప్పు రేకులకు రంధ్రాలు పడ్డాయి.
చినుకు పడితే తరగతి గదులు చిత్తడిగా మారుతున్నాయి. 2021 నుంచి భవనానికి అద్దె చెల్లించడం లేదు. దీంతో భవన యజమాని మరమ్మతులు చేయడం లేదు. భవనాన్ని ఖాళీ చేసి వెళ్లాలని కోరుతున్నాడు. చేసేదేమీ లేక సమస్యల నడుమ పాఠశాల కొనసాగుతున్నది. తాగేందుకు నీళ్లు కూడా హెచ్ఎం తన సొంత డబ్బులతో తెప్పిస్తున్నాడు. పాఠశాలలో ప్రస్తుతం 89 మంది విద్యార్థులు ఉన్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ