పెద్దవూర, జనవరి 10 : గ్రామల సమగ్రాభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తలూరు, బసిరెడ్డి పల్లె, గర్నెకుంట గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులు రూ.కోటితో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, దళితుల కోసం దళితబంధు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ చెన్ను అనూరాధాసుందర్రెడ్డి, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ గోనె వివేక్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, గోనె విష్ణువర్ధన్ రావు, భగవన్నాయక్, సర్పంచులు నరాల కొండయ్య, నడ్డి హలియమ్మారామాంజనేయులు, షేక్ అబ్బాస్, షేక్ బషీర్, సత్యనారాయణరెడ్డి, ధర్మారెడ్డి, మెండె సైదులు యాదవ్, రామలింగయ్య, పల్లె బోయిన శంకర్, రాజేశ్‌నాయక్ పాల్గొన్నారు.
కస్తూర్భా పాఠశాల సందర్శన
మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే నోముల భగత్ సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
మండలంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బ్యాగులు, పెట్టెలు, దుప్పట్లను మంగళవారం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల అధ్యాపకులు ఎమ్మెల్సీతో పాటు ఎంపీపీ చెన్ను అనురాధాసుందర్రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో తిర్మలగిరి(సాగర్) ఎంపీపీ ఆంగోతు భగవన్ నాయక్, సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, ఎంపీటీసీ పులిమాల కృష్ణారావు, పిన్సిపాల్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.