కోదాడ, మే 25 : కోదాడ రెవెన్యూ పరిధిలో 615, 616 సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు అక్రమ పట్టా మార్పిడి చేశారని పేర్కొంటూ కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం జరగాలని కలెక్టర్ ను అభ్యర్థించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా రైతులు వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు పల్లా సీతారామాంజనేయులు, వెంకయ్య, గోవిందు, నరేష్, విజయలక్ష్మి, అశోక్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.