కోదాడ, జనవరి 03 : కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు సాయి శ్రీ నగర్లో రహదారిపై డ్రైనేజీ గూణలు పగిలి మురుకి నీరు బయటికి వచ్చి దుర్వాసన వస్తుందని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం 22వ వార్డు బీఆర్ఎస్ ఇన్చార్జి కాసాని మల్లయ్య గౌడ్ కమిషనర్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. దీంతోపాటు డ్రైనేజీ పగిలిన చోట ఇనప సువ్వలు బయటికి తేలి ప్రమాదకరంగా తయారై పాదచారులు, వాహనదారులకు ఇబ్బందిగా మారినట్లు తెలిపారు. కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

Kodada : ‘కమిషనర్ గారూ సమస్యలు పరిష్కరించండి’