సూర్యాపేట, జనవరి 30 : సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు అభ్యర్థిగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి బికుమళ్ల మంజుల ఉపేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎనలేని అభివృద్ధితో కేసీఆర్ పాలన తీరు, గత పదేండ్లలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేటలో ప్రశాంత వాతావరణంలో జరిగిన అభివృద్ధిని ఆమె కొనియాడారు. అటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Suryapet : కల్నల్ సంతోష్ బాబు తల్లి మంజుల నామినేషన్ దాఖలు