వాణిజ్య సంస్థలు జిల్లా అభివృద్ధికి సహకరించాలి
పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, వాణిజ్య బ్యాంకులు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ సమావేశం నిర్వహించారు.
నీలగిరి, ఫిబ్రవరి 20: పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, వాణిజ్య బ్యాంకులు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో పేదలకు సహకారం అందించాలన్నారు. జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసినందున ఆ కమిటీ ఆమోదంతో అవసరమైన రంగాల్లో, అవసరమైన చోట ఆర్థిక సహకారం అందించాలన్నారు. పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలు, బ్యాంకర్లు, రైస్ మిల్లర్లు అంగీకరించడంతో పాటు కలెక్టర్ చర్యకు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీశ్, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, బ్యాంకు నియంత్రణ అధికారులు పాల్గొన్నారు.
చదువు తో పాటు క్రీడల్లో రాణించాలి
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 20: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మేకల అభినవ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను వారు ప్రారంభించారు. అనంతరం శాంతి సామరస్యానికి చిహ్నంగా పావురాలను ఎగరేశారు. రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణస్థాయి నుంచి విద్యార్థులను గుర్తించి తోడ్పడటమే సీఎం కప్ పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి అక్బర్ అలీ, జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

