నీలగిరి, ఏప్రిల్ 11: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతిఒకరూ కృషి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో జిల్లా డ్రగ్స్ కంట్రోల్ పరిపాలన విభాగం, జిల్లా వైద్యారోగ్య శాఖ, తెలంగాణ యాంటీ నారోటిక్స్ బ్యూరో, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిర్మూలన అవగాహన ర్యాలీని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్యాశ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోందని, ముఖ్యంగా యువతను దారి తప్పించే ప్రమాదం ఉందన్నారు. మత్తు పదార్థాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 300మందికి పైగా విద్యార్థులు, డ్రగ్ లైసెన్స్ హోల్డర్లు పాల్గొని మత్తు మందుల వినియోగం, నకిలీ మందుల నియంత్రణ, యాంటీబయాటిక్ నిరోధకత వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. మందుల కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ వంటి సాంకేతిక పద్ధతులను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రిస్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం పూర్తిగా నిషేధమని, ఫార్మసీలు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పేరొంటూ, ప్రజల సహకారం కూడా అత్యంత అవసరమన్నారు. ర్యాలీలో ఏఎస్పీ రమేశ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంపత్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ నరసింహారావు పాల్గొన్నారు.
ఆవిషర్తలకు, వ్యవస్థాపకులకు మార్గదర్శకత్వం అందిస్తూ నల్లగొండలోని ఐటీ హబ్లో శనివారం నిర్వహించిన టీజీఐసీ ఇన్నోవేషన్ పంచాయత్-2026ను విజయవంతంగా నిర్వహించారు. నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పారిశ్రామికవేత్తలకు, రాజధానిలోని అగ్రశ్రేణి అంకుర సంస్థల (స్టార్టప్) వ్యవస్థకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కల్పిస్తూ ఈ ఇన్నోవేషన్ వారధిగా నిలిచింది. సంస్థాగత మద్దతును గ్రామీణస్థాయి సృజనాత్మకతతో జోడించడం ద్వారా, ఉమ్మడి జిల్లాకు చెందిన 60 మందికి పైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, గ్రామీణ ఆవిషర్తలను ఆకర్షించింది. నిధుల సమీకరణ, వ్యాపార విస్తరణ, నమూనాల రూపకల్పన (ప్రోటోటైపింగ్), ఆలోచనల నిర్ధారణ, మారెటింగ్ వంటి అంశాలకు సంబంధించి తమకున్న సందేహాలను నిపుణులతో చర్చించి నివృత్తి చేసుకున్నారు. స్థానిక ఆవిషర్తలు, వ్యవస్థాపకులు తమ ఆవిషరణలు, నూతన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు అంకుర పరిశ్రమల నుంచి వచ్చిన 12 మంది మార్గదర్శకులను (మెంటర్లను) కలిశారు. వ్యవసాయ, ఆరోగ్య, జీవనోపాధి తదితర రంగాల్లో వారి ఆలోచనలను పరిశీలించిన నిపుణులు, తగిన సూచనలు, సలహాలు అందించారు.
నూతన ఆలోచనల ఆవిష్కరణలకే ఇన్నోవేషన్ నిర్వహించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆలోచనలు అనేకం ఉన్నప్పటికీ వాటిని ఆచరణలోకి తెచ్చే స్పష్టత, సమస్య తీవ్రతను గుర్తించడమే అసలైన విజయమన్నారు. నల్లగొండ ఒక విద్యా కేంద్రంగా మారుతున్న తరుణంలో ఇకడి యువతకు అవసరమైన భరోసాను, నిలకడైన తోడ్పాటును అందించడానికి టీజీఐసీ తమ కేంద్రాన్ని ఐటీ టవర్లో ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ సీఈవో మెరాజ్ ఫహీమ్ తదితరులు ఉన్నారు.