నల్లగొండ నమస్తే తెలంగాణ, మార్చి 29 : సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాల రీత్యా వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 41 మందికి శనివారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.13.66 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సంవత్సరానికి దాదాపు రూ.1000 కోట్లకు పైన రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు.