నాగారం, ఏప్రిల్ 2 : సూర్యాపేట జిల్లా నాగారం మండలం పరిధిలోని నాగారం బంగ్లా గ్రామానికి చెందిన తోడుసు నాగమల్లు కుమారుడు మణికర్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో వైద్య చేయించుకోగా సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.60 వేలు మంజూరు కాగా చెక్కును కాంగ్రెస్ మండల నాయకులు బుధవారం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాశం యాదవరెడ్డి, నాయకులు గుంటకండ్ల ముకుందరెడ్డి, కన్నెబోయిన అంజయ్య, జాజుల వీరయ్య, వెంకటేశ్వర్లు, ఆవుల వెంకన్న, కడారి సోమయ్య, మంగదుడ్ల దశరథ, ఉపేందర్, చంద్రశేఖర్, మహేశ్, కన్నెబోయిన నాగరాజు, లింగమల్లు, రమేశ్ పాల్గొన్నారు.