యాదగిరిగుట్ట, మే 19 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఈనెల 23న సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నట్లు దేవస్థాన ఈవో భవానీశంకర్ మంగళవారం తెలిపారు. కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి టెంపుల్ సిటీపై రూ.43 కోట్లతో నిర్మిస్తున్న వేదపాఠశాల నిర్మాణ పనులకు శనివారం ఉదయం భూమిపూజ చేస్తారన్నారు.
కొండపై రూ.100 కోట్లతో బాలాలయ ప్రాంతంలో నిత్య కల్యాణ మండపం, వాయువ్యదిశలోని లిప్టు పక్కన నుంచి తిరుమాడ వీధుల్లోకి వెళ్లేందుకు ప్రత్యేకమైన మెట్ల మార్గం పనులు, లక్ష్మీపుష్కరిణిలోని శివాలయానికి వెళ్లే ప్రాంతంలో దీక్షాపరుల మండపం, వసతి గృహాలు, వైకుంఠ ద్వా రం నుంచి కొండపైకి వెళ్లే శ్రీవారిమెట్ల మార్గానికి ప్రత్యేకమైన టన్నెల్ ఫ్యాబ్రిక్ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.