పెండింగ్ పనులపై సీఎం ప్రకటన చేయాలి
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్టకు వస్తున్న నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై సానుకూల ప్రకటన చేయాలని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి
యాదగిరిగుట్ట, మే22 : శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్టకు వస్తున్న నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై సానుకూల ప్రకటన చేయాలని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్నేళ్లుగా ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలని పలుమార్లు వినతి పత్రం అందజేశామని, ఇందుకు సంబంధించిన రిపోర్టు సైతం ప్రభుత్వం వద్ద ఉందన్నారు. సీఎం వెంటనే రెవెన్యూ డివిజన్‌ను ప్రకటించాలన్నారు గతంలో తిరుమలాపూర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారన్నారు.
ఇందులో భాగంగా గంధమల్ల రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని, నిర్వాసితులకు వెంటనే ఒప్పందం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. గుట్టలో వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అక్రమ క్రషర్లు, ఇసుక రవాణా చేస్తున్న సందర్భంగా రహదారులు పూర్తిగా నాశనమయ్యాయని, వెంటనే రెన్యువల్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న హైలెవెల్ బ్రిడ్జిలు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎస్టీ సబ్ ప్లాన్, టీయూఎఫ్ఐడీసీ నిధులతో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి, పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులను గోదావరి జలాలతో నింపాలని, ఈ ప్రాంతంలో ఐటీ పరిశ్రమను నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

