Mother’s Day | అమృతం, ఎలా ఉంటుందో తెలియదు కానీ, అమ్మ ప్రేమ లోనే అమృతం ఉంటుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ అభిప్రాయ పడ్డారు. ప్రతి ఏటా మే రెండో ఆదివారం వరల్డ్ మదర్స్ డే గా జరుపుకోవడం పరిపాటి. ఈ సందర్భంగా రఘునందన్ ఆదివారం తన మాతృమూర్తి విజయ ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే ఆన్న నానుడి అక్షర సత్యం అన్నారు. తమ సంతానం ఎదుగుదలను ఆకాంక్షిస్తూ..ఉన్నతి కోసం ఆశీర్వాద బలం, ప్రబలంగా పని చేసేది అమ్మ దీవెనే అని స్పష్టం చేశారు.
బిడ్డలను కంటి పాపల్లా చూసుకునే అమృత మూర్తి అమ్మే అని మాచన రఘునందన్ చెప్పారు. అమ్మను మించిన దైవం లేదన్నారు. ప్రత్యక్ష దైవం అమ్మ అని అన్నారు. అమ్మ ఆశీర్వాదం అందలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత పొగాకు, ధూమపానం అలవాట్లకు లోనయ్యి కన్నతల్లికి పుత్ర శోకం కలిగించవద్దని కోరారు.
మాతృ దినోత్సవం సందర్భంగా మే 14 న `అమ్మ ప్రేమకు కానుకగా` పొగాకు, ధూమపానం వంటి దురలవాట్లను మానేస్తాం అని ప్రతిజ్ఞ చేయాలని మాచన సూచించారు. అమ్మ ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తే, తల్లికి గర్వకారణంగా నిలిచే సంతానం అవ్వాలే కానీ, దుర్లవాట్లతో కన్నవారి కళ్లెదుటే కన్ను మూయడం అవాంఛనీయం, ఎంతో ఆవేదనకరం అని అన్నారు. మే 31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒకవేళ పొగాకు, ధూమపానం అలవాట్లు ఉంటే అమ్మ కోసమైనా, ఆ అలవాట్లు వదిలి పెట్టాలని మాచన పిలుపునిచ్చారు.