నిడమనూరు, ఏప్రిల్ 13 : వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని హాలియా సీ.ఐ, డి. సతీష్ రెడ్డి సూచించారు. ముకుందా పురంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరుగకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.
రోడ్డు భద్రత వారోత్సవాల్లో వాహనదారులకు అవగాహన కల్పించిన సీఐ డి. సతీశ్ రెడ్డి లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, ప్రతిఒక్కరు లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన ప్రజల చేత రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై ఉప్పు సురేష్ కుమార్, నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, ముకుందాపురం సర్పంచ్ సలికంటి పద్మ సత్యం, నాయకులు ముంగి శివ మారయ్య, కొండా శ్రీనివాసరెడ్డి, నర్సింగ్ విజయకుమార్, మంజుల శ్రీనివాస్,షేక్ జానీ పాషా, మెరుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.