Nallagond | మానవత్వం చాటుకున్న సీఐ అదిరెడ్డి
CI Adireddy | పది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని వ్యక్తి పోగొట్టుకున్న పర్సు, అందులో నగదును శుక్రవారం నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పోగొట్టుకున్న వ్యక్తి సంబంధీకులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కె. అదిరెడ్డి.

నల్లగొండ : పది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని వ్యక్తి పోగొట్టుకున్న పర్సు, అందులో నగదును శుక్రవారం నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పోగొట్టుకున్న వ్యక్తి సంబంధీకులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కె. అదిరెడ్డి.
విధి నిర్వహణలో భాగంగా పది రోజుల క్రితం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఆయనకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పర్సు రోడ్డుపై లభించింది.
అందులో 5,620 నగదు, ఏటీఎం కార్డు, ఇతర పేపర్స్ ఉండగా పోగొట్టుకున్న వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆచూకీ అందులో లేకపోవడంతో ఆయన పర్సులో ఉన్న ఏటీఎం కార్డు ఆధారంగా బ్యాంకు అధికారులతో సంప్రదించి అతని ఫోన్ నెంబర్ తెలుసుకోవడంతో పాటు, ఆయన ఒంగోలుకు చెందిన అనిల్ కుమార్ చౌదరిగా గుర్తించి సమాచారం అందించారు.
శుక్రవారం అనిల్ కుమార్ చౌదరి సంబంధీకులు నల్లగొండకు రాగా డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా సీఐ అదిరెడ్డి తనకు దొరికిన పర్సు, అందులో ఉన్న నగదు, ఏటీఎం కార్డు, ఇతర పత్రాలను అందజేసి తన మానవత్వం చాటుకున్నారు.
సీఐ అదిరెడ్డి నిజాయితీ, మానవత్వం పట్ల అనిల్ కుమార్ చౌదరి, ఆయన సంబంధీకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి సీఐ అదిరెడ్డిని అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

