రామగిరి, సెప్టెంబర్ 03 : నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, డాక్టర్ చింతోజు మల్లికార్జున చారికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందజేసింది. బుధవారం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి, ఆచార్య వెలుదండ నిత్యానంద రావు చేతుల మీదుగా ఆయన ఈ కీర్తి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున చారికి నల్లగొండకు చెందిన సాహితీవేత్తలు మేరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, పెరుమాళ్ల ఆనంద్, వేణు సంకోజు, డాక్టర్ సాగర్ల సత్తయ్య, కనకటి రామకృష్ణ, శీలం భద్రయ్య, దర్శనం అంజయ్య, పెందోట సోము, బీఈడీ కళాశాల సీనియర్ అధ్యాపకులు బొడ్డుపల్లి రామకృష్ణ అభినందనలు తెలిపారు.